సర్వేల పేరుతో గొలి కొడుతున్న ఆర్నాబ్..! బీజేపీ – వైసీపీ కలుస్తాయా..?

వైసీపీకి ఇరవై పార్లమెంట్ సీట్లు వస్తాయట.. టీడీపీకి ఐదు సీట్లు వస్తాయట. ఓట్ల శాతం… రెండు పార్టీలకు పది శాతం తేడా ఉందట. కానీ.. బీజేపీకి పదకొండు, కాంగ్రెస్‌కు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయట. బీజేపీకి ఏపీలో పదకొండు శాతం ఓట్లు వస్తాయంటే.. నమ్మేవాళ్లెవరైనా ఉంటారా..? కాంగ్రెస్ పార్టీ 9 శాతం ఓట్లు చీల్చుకుంటే.. వైసీపీకి 40 శాతం ఓట్లు వస్తాయా..?. అన్నీ ప్రశ్నలే.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు.. ఆర్నాబ్ అనే బీజేపీ జర్నలిస్ట్. ఈ సర్వేలు.. ఈ ఓటింగ్ షేర్స్ చూస్తే.. బీజేపీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది.. అని మిత్రుల్ని వెదికి పెట్టే ప్రయత్నం ఏదో చేస్తున్నారన్న ఫీలింగ్ మాత్రం అందరికీ కలగం సహజమే.

బీజేపీకి వ్యతిరేకంగా.. ఏ పార్టీ అయినా నోరెత్తిందంటే.. ఆ పార్టీ ఉన్న రాష్ట్రంలో ఓ ఓపీనియన్ పోల్ ప్రకటించేస్తారు. అందులో బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తిన పార్టీ చాలా వెనుకబడిపోయిందని చెబుతూ ఉంటారు. ఏపీ విషయంలో ఇలాంటి వ్యూహం.. గత ఆరు నెలలుగా అమలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ రాజకీయాలపై ఎప్పుడు దృష్టిపెట్టినా.. ఓ సర్వే బయటకు వచ్చేస్తుంది. కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార సమయంలో అలానే వచ్చింది. రెండు నెలల కిందట.. అలాగే.. వచ్చింది.. మొన్న చంద్రబాబు ఢిల్లీలో ఉన్న సమయంలోనూ అలాగే ఓ సర్వేను విడుదల చేశారు. నిజానికి ఏపీలో, తెలంగాణలో ఎన్ని జిల్లాల్లున్నాయో.. ఆర్నాబ్ కు తెలుసో లేదో కానీ.. చిత్ర విచిత్రమైన ఫిగర్స్‌తో ఫలితాలు ప్రకటిస్తూ ఉంటారు.

ప్రజల్లో పలుకుబడి లేకపోవడంతో… మిత్రపక్షాలు ఏవీ దగ్గరకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో.. మళ్లీ మోడీనే గెలవబోతున్నాడనే ప్రచారం చేసి.. ప్రాంతీయ పార్టీలను భయపెట్టే ప్రయత్నాలు మోడీ చేస్తున్నారని.. అందరికీ తెలుసు. కానీ బీజేపీ మేపే టీవీ చానళ్లు… మోడీ గెలుస్తారని.. ఎంతగా చెప్పినా… ప్రజలు నమ్ముతారా అనేది డౌటే. ఎందుకంటే.. దేశాన్ని నియంతృత్వం దిశగా తీసుకెళ్లే వ్యక్తికి ఎవరైనా ఓట్లు వేస్తారా..?

Leave a Reply

*